దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Dec 11, 2021, 07:42 PM IST
దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్ (hyderabad) రాజేంద్ర నగర్‌లో (rajendranagar) దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను పార్వతి, చిన్నారులు శ్రేయ, తన్వికిగా గుర్తించారు.

హైదరాబాద్ (hyderabad) రాజేంద్ర నగర్‌లో (rajendranagar) దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను పార్వతి, చిన్నారులు శ్రేయ, తన్వికిగా గుర్తించారు. కొద్దిరోజులుగా భర్తతో గొడవలు జరుగుతుండగా.. ఇవాళ ఉదయం కూడా పార్వతి భర్తతో గొడవ పడింది. దీంతో ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్తపై కోపంతో పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పార్వతితో పాటు చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే