ఫేస్ బుక్ పరిచయం, ప్రేమ పేరుతో.. మైనర్ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం..

Published : Jun 09, 2022, 12:35 PM IST
ఫేస్ బుక్ పరిచయం, ప్రేమ పేరుతో.. మైనర్ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం..

సారాంశం

ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల మీద రెండేళ్లుగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన హైదరాబాద్ లోకి వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ : అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచారం ఘటన తరువాత వెలుగులోకి వస్తున్న molestation ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా secendrabadలో ఓ minor అక్కాచెల్లెళ్ల మీద ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నవాజ్ (21), ఇంతియాజ్ (21)ను అంబర్ పేట్ వాసులుగా గుర్తించారు. అక్కా చెల్లెళ్లని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్న నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

కాగా, హైదరాబాద్ లో రోజురోజుకూ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళ ఒంటరిగా కనిపించినా, నలుగురిలో ఉన్నా.. ఏమార్చి, మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా Shamshabadలో అడ్డా నుంచి మహిళా కూలీని పని ఉందని చెప్పి.. తీసుకువెళ్ళిన కామాంధులు ఆమెపై molestationకి పాల్పడడంతో పాటు.. అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృత్యువాత పడింది. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లి తండాకు చెందిన ఓ మహిళ (40) దినసరి కూలీ.  రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్ లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు work ఉందంటూ ఆమె ను పిలిచారు.

ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వ గూడ  వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత బండరాయితో తలపై మోది పరారయ్యారు.  రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడుని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తుంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.

కాగా, జగిత్యాల జిల్లాలో బుధవారం మరో murder వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ మండలం వాడపల్లి శివారులోని ఊర చెరువులో fishes పట్టేందుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35సం.లు) dead body కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటనా స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి పోలీసులు భావిస్తున్నారు.

ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకువచ్చి.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి.. తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డిఎస్పి ప్రకాష్ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహిళ కేసు నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు? ఆమె పై అత్యాచారం చేసిన వారు ఎవరు? అనే విషయం ప్రస్తుతం తెలియరాలేదని డిఎస్పీ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kondagattu పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని Pawan Kalyan ఎందుక‌న్నారు? | Anjaneya Swamy | Asianet News Telugu
MLA Medipally Satyam Emotional Words: ఆంజనేయస్వామే పవన్ కళ్యాణ్ గారినికాపాడారు | Asianet News Telugu