ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి, జవాన్‌కు తీవ్ర గాయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 10:57 AM IST
Highlights

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ములుగు జిల్లా (mulugu district) వెంకటాపురం మండలంలోని కర్రెలగుట్ట వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ (encounter) జరిగింది. 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ములుగు జిల్లా (mulugu district) వెంకటాపురం మండలంలోని కర్రెలగుట్ట వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ (encounter) జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని  చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తొలుత జవాన్‌ను గాయపడిన చోటుకు వైద్యున్నితరలించి చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌‌లో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌కు తరలించారు. ప్రస్తుతం అంబులెన్స్‌లో అవసరమైన చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకోసం ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో హెలికాఫ్టర్‌ను సిద్దంగా ఉంచారు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న కర్రెలగుట్ట సమీపంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు, మావోయిస్టులకు మధ్య కర్రెలగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు అరగంట పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టుగా సమాచారం. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింతగా పెంచారు. 

ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఒకరిని ఏటూరు నాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది

click me!