వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి అన్నాదమ్ములు లైంగిక దాడి...

Published : Oct 12, 2021, 07:21 AM IST
వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి అన్నాదమ్ములు లైంగిక దాడి...

సారాంశం

ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్ కు చెందిన ఓ married woman పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు పై ఆదివారం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.  ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళిన.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తోడేళ్ళలా  చుట్టుముట్టు మృగాలు ఏ రూపంలో ఎలా దాడి చేస్తారో  అర్థం కాని పరిస్థితి.  అమ్మాయి అయితే చాలు వావివరుసలు, వయసు తేడాలు, ఉచ్చ నీచాలు మరచి rapeలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణమైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది... 

ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్ కు చెందిన ఓ married woman పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు పై ఆదివారం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  సీఐ రామకృష్ణ కథనం ప్రకారం వివాహిత స్నానం చేస్తుండగా ఇంటి పక్కనే ఉండే యువకుడు ప్రవీణ్ సెల్ఫోన్తో ఫోటోలు,  వీడియోలు  తీశాడు.  వాటితో బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా లొంగదీసుకున్నాడు.

బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్

ఇదే అదనుగా అతని సోదరుడు  గిరిధర్ కూడా బ్లాక్ మెయిల్ కు  పాల్పడుతున్నాడు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు.  దీంతో తనపై లైంగిక దాడి  చేశారని,  వేధింపులకు పాల్పడుతూ  కులం పేరుతో దూషించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులపై  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.  ఏ సి పి ఆంజనేయులు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్