హైదరాబాద్‌ శివార్లలో రోడ్డు ప్రమాదం.. గోడను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి..

Published : Dec 25, 2022, 12:17 PM IST
 హైదరాబాద్‌ శివార్లలో రోడ్డు ప్రమాదం.. గోడను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి..

సారాంశం

హైదరాబాద్‌ శివార్లలో జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెహ్రునగర్‎లో అతివేగంతో దూసుకువచ్చిన బైక్ ఓ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

హైదరాబాద్‌ శివార్లలో జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెహ్రునగర్‎లో అతివేగంతో దూసుకువచ్చిన బైక్ ఓ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలానికి పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. మృతులును క్రాంతి కుమార్, సందీప్‎‌లుగా గుర్తించారు. వివరాలు.. గండి మైసమ్మ నుంచి షాపూర్‌నగర్ వెళ్తున్న బైక్ ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఓ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న క్రాంతి అక్కడికక్కడే మృతిచెందారు. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెనకాల కూర్చొన్న సందీప్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు సందీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మృతిచెందాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu