నారాయణపేట జిల్లాలో విషాదం: కర్నూల్ కు చెందిన ప్రేమ జంట ఆత్మహత్య

By narsimha lode  |  First Published Dec 25, 2022, 10:37 AM IST

నారాయణపేట జిల్లాలో  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  ప్రేమ జంట  తెలంగాణలోని  చేగుంట రైల్వే స్టేషన్ వద్ద  రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది.


నారాయణపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రేమ జంట నారాయణపేట జిల్లాలో  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కర్నూల్  జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనూరు గ్రామానికి చెందిన ప్రేమ జంట  తెలగాణ జిల్లాలో  ఆత్మహత్య చేసుకుంది.  తెలంగాణలోని  నారాయణపేట జిల్లాలోని చేగుంట రైల్వే స్టేషన్ పరిధిలో  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు రైల్వే పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంటను  అనిత, కుమార్ గా  గుర్తించారు. 

వరస కుదరదని అనిత, కుమార్ ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.  కర్నూల్  జిల్లాకు చెందిన  ఈ రెండు కుటుంబాలు ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లాకు వలసవెళ్లాయి.  ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని  మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వీరి పెళ్లికి  రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో  నారాయణపేట జిల్లా పరిధిలోని చేగుంట రైల్వేస్టేషన్ పరిధిలో  రైలు కింద  పడి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు.

Latest Videos

రెండు తెలుగురాష్ట్రాల్లో  గతంలో కూడా ప్రేమ జంటలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు  చేసుకున్నాయి.  ప్రేమించిన విషయం ఇంట్లో పెద్దలకు తెలుస్తుందనే భయంతో కొందరు, పెళ్లికి  పెద్దలు  ఒప్పుకోవడం లేదనే కారణంతో  ఆత్మహత్యలు చేసుకున్న కేసులు  నమోదయ్యాయి.  

also read:యాదాద్రి బహుపేటలో విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య

ఈ ఏడాది నవంబర్  9వ తేదీన  తెలంగాణలోని యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో  రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికురాలికి  ఇటీవలనే వివాహమైంది.  పెళ్లికి ముందు  ప్రేమించిన  యువకుడిని మర్చిపోలేక యువతి  అతడితో కలిసి  ఇంటి నుండి  వెళ్లిపోయింది.  ఇంటి నుండి వెళ్లిపోయిన మరునాడే   ప్రియుడితో  కలిసి  ఆత్మహత్య చేసుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అదృశ్యమైన ప్రేమ జంట  హైద్రాబాద్ లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఈ ఏడాది మే  17న చోటు  చేసుకుంది. ఈ ఘటనలో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందింది

ఈ ఏడాది నవంబర్  8వ తేదీన ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది. సుబ్బారావు, తేజలు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి  పెద్దలు అంగీకరంచరనే భయంతో  ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.ఈ ఏడాది నవంబర్  మాసంలో  తిరుపతిలో  ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివాహిత  ప్రియుడితో కలిసి  తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.  పెళ్లికి ముందే  ఓ యువకుడిని యువతి ప్రేమించింది.  ఆ యువకుడితో  పెళ్లికి  యువతి ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో పుట్టింటికి వచ్చిన యువతి  ప్రియుడితో  కలిసి  తిరుపతికి వెళ్లింది.  తిరుపతి లాడ్జీలో  గదిని అద్దెకు తీసుకున్నారు.  ఈ ఏడాది నవంబర్  8వ తేదీన ఈ జంట  లాడ్జీలో  ఆత్మహత్య చేసుకుంది.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం అడవి మజీద్ లో  ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈ ఏడాది సెప్టెంబర్  10న జరిగింది.జనగామ జిల్లాలో అక్టొబర్ మాసంలో  ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

click me!