Hyderabad Accident: వలసకూలీలతో వెళుతూ డివైడర్ ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Mar 02, 2022, 01:48 PM ISTUpdated : Mar 02, 2022, 02:00 PM IST
Hyderabad Accident: వలసకూలీలతో వెళుతూ డివైడర్ ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

సారాంశం

మధ్యప్రదేశ్ కు చెందిన వలసకూలీలు ప్రయాణిస్తున్న కారు హైదరాాబాద్ శివారులో రోడ్డుప్రమాదానికి గురవడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఏడుగురు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) శివారులోని మేడ్చల్ జిల్లా (medchal district)లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిదిమంది వలసకూలీలు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డుమధ్యలో వుండే డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ (madhya pradesh) రాష్ట్రానికి చెందిన కొందరు బ్రతుకుదెరువు కోసం తెలంగాణకు వసలవచ్చారు. వీరు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటే కుటుంబాలను పోషించుకునేవారు.  

అయితే వీరిలో కొందరు రామాయంపేటలో పని వుండటంతో ఇటీవలే అక్కడికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు నగర శివారులోని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. 

డ్రైవర్ మద్యంమత్తులో కారు నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బావర్చి హోటల్ ఎదురుగా డివైడర్ కు డీకొట్టింది. ప్రమాద సమయంలో  కారులో తొమ్మిదిమంది వుండగా తీవ్రంగా గాయపడి గోరీ సింగ్, బబ్లీ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఏడుగురికి కూడా తీవ్రగాయాలపాలయ్యారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రెండు మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇక మరో తెలుగురాష్ట్రమైన ఏపీలోనూ ఇలాగే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా సీకేదిన్నె మండలం మద్దిమడుగు గ్రామంలో అత్యంత దారుణంగా ప్రమాదం జరిగింది. ఇంటి వద్ద కూర్చున్న వారిపైకి అతివేగంగా వచ్చిన వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఇదిలావుంటే హైదరాబాద్ లో ఓ యువకుడిని కూడా అతివేగం బలితీసుకుంది. మితిమీరిన వేగంతో వెళుతూ ఏకంగా ప్లైఓవర్ పైనుండి పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెహదీపట్నం (mehdipatnam) సమీపంలోని గోల్కొండ ఏరియాలో మహ్మద్ సర్పరాజ్ హుస్సెన్(18) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. తన మధ్యతరగతి కుటుంబానికి చేదోడువాదోడుగా వుండేందుకు ఇంటికి సమీపంలోనే ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు. 

రోజూమాదిరిగానే నిన్న(మంగళవారం) ఉదయం కూడా మెడికల్ షాప్ కు వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో పనిపై షేక్ పేటకు బుల్లెట్ పై బయలుదేరాడు. అయితే అతడు టోలీచౌకీ ప్లైఓవర్ పై అతివేగంతో వెళుతుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పింది. దీంతో ప్లైఓవర్ పై నుండి బైక్ తో సహా హుస్సేన్ కూడా అమాంతం కిందపడిపోయింది.  

ప్రమాద సమయంలో హుస్సేన్ హెల్మెట్ పెట్టుకొని లేకపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తపుమడుగులో పడివున్న అతడిని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా హుటాహుటిన వారు ఘటనాస్ధలికి చేరుకున్నారు. రోడ్డుపై రక్తపుమడుగులో పడివున్న హుస్సేన్ ఓ అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే హుస్సెన్ మృతిచెందాడు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి