నిలోఫర్ హాస్పిటల్‌లో కిడ్నాప్‌ కలకలం.. గంటల వ్యవధిలో కేసును చేధించిన పోలీసులు..

Published : Mar 02, 2022, 12:33 PM ISTUpdated : Mar 02, 2022, 01:16 PM IST
నిలోఫర్ హాస్పిటల్‌లో కిడ్నాప్‌ కలకలం.. గంటల వ్యవధిలో కేసును చేధించిన పోలీసులు..

సారాంశం

హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. 18 నెలల చిన్నారిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. మహిళ చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌లో (Niloufer Hospital) కిడ్నాప్ కలకలం రేపుతోంది. 18 నెలల చిన్నారిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. చిన్నారి కిడ్నాప్‌కు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించి.. పాపను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

చిన్నారి తల్లి ఈరోజు ఉదయం చెకప్ కోసం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చారు. అయితే ఉదయం 9.30 గంటలకు పాప కిడ్నాప్ అయింది. ఎంత వేతికిన పాప కనిపించక పోవడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి  కిడ్నాపర్ ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చేపట్టారు. మహిళ చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కిడ్నాపర్ ఆటోలో ఎక్కిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలోనే పోలీసులు పాప సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఫుటేజ్, మహిళా ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కేసును వేగంగా చేధించారు. మోహిదీపట్నం కౌమటికుంటలో పాప ఆచూకీకి పోలీసులు కనుగొన్నారు. పాపను సురక్షితంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను కిడ్నాప్‌ చేసిన పట్టుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఉదయం 10:15 గంటలకు పాప మిస్సింగ్ అయినట్టుగా సమాచారం అందిందని.. గంటన్నర వ్యవధిలోనే పాప ఎక్కడుందో ట్రేస్ చేశామని పోలీసులు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?