
హైదరాబాద్: తెలంగాణ తలసరి ఆదాయం 125 శాతం పెరిగిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైద్రాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో బుధవారం నాడు నిర్వహించిన CII వార్షిక సదస్సులో తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో Telangana అభివృద్ది పథంలో దూసుకు పోతోందని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి చెప్పారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ అతి ెద్ద సక్సెస్‌పుల్ స్టార్టప్ అని కేటీఆర్ ప్రకటించారు.స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందన్నారు.తెలంగాణ రాష్ట్రం కొత్త ఆవిష్కరణలకు వేదికైందని మంత్రి చెప్పారు.తెలంగాణలో మౌళిక వసతుల కల్ఫన కోసం తమ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణలో పెద్దగా కంపెనీలు లేవన్నారు. కానీ ప్రస్తుతం Hyderabad లో ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పథకం కేంద్రంతో పాటు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో కోటి ఇండ్లకు సురక్షితమైన మంచినీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోయేలా చేశామన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం 125 శాతం పెరిగిందన్నారు. GSDPలో వ్యవసాయవృద్ది 21 శాతానికి చేరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన హరిత హరం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 31 శాతానికి పెరిగిందన్నారు. మొక్కల పెంపకం కోసం ఆయా స్థానిక సంస్థలను బాధ్యులను చేస్తూ చట్టం కూడా తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి తెలిపారు.టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రములకు 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు.
అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు Kaleshwaram నాలుగేళ్లలో పూర్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ధాన్యాగారంగా మారిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పంజాబ్ కంటే అధికంగా వరి ధాన్యాన్ని పండించామని చెప్పారు. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు లబ్ధి చేసే చర్యలు తీసుకోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి కోసం రైతుబంధు కింద సంవత్సరానికి రెండుసార్లు ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. గత ఏడేండ్లలో రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచామని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంపై కేటీఆర్ ఇలా...
మలేషియా, ఇండోనేషియాతో తెలంగాణ పోటీ పడుతుందని కేటీఆర్ చెప్పారు.చైనా నుండి పెట్టుబడిదారులు బయటకు రావాలనుకొంటున్నారని కానీ కేంద్రం తీరుతో పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసిరస్తున్న పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులు మాట్లాడాలని కేటీఆర్ కోరారు. తాను ఈ విషయమై మాట్లాడితే రాజకీయ విధానమంటారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక విధానాలపై రాహుల్ బజాజ్ గట్టిగా మాట్లాడేవారని ఆయన గుర్తు చేశారు. చైనా నుండి బయటకు వచ్చిన ఏరోస్పేస్ సంస్థ హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలో ఉందని చెప్పారు.కానీ కేంద్రం మాత్రం ఈ సంస్థను బుందేల్ ఖండ్ లో ఏర్పాటు చేయాలని కోరుతుందన్నారు. అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు కేంద్రం అవకాశమివ్వాలని కేటీఆర్ కోరారు. యూపీలో 80 ఎంపీ సీట్లున్నందున అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనడం, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలున్నందున ఇక్కడ చేయాల్సిన అవసరం లేదనే వాదన సరికాదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ కూడా భారతదేశంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు.