వైరా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, బాణాసంచా పేలుడు: ఇద్దరు మృతి

Published : Apr 12, 2023, 01:29 PM ISTUpdated : Apr 12, 2023, 05:22 PM IST
 వైరా  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, బాణాసంచా  పేలుడు: ఇద్దరు మృతి

సారాంశం

ఖమ్మం  కారేపల్లి  మండలం  చీమలపాడులో  జరిగిన  పేలుడు  ఘటనలో  ఇద్దరు మృతి చెందారు. 

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలం  చీమలపాడులో సిలిండర్  పేలుడు  ఘటనలో  ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో  గాయపడిన  వారిలో చికిత్స  పొందుతూ  బానోతు  రమేష్, ఆంగోతు  మంగు మృతి చెందారు. 

 ఖమ్మం  జిల్లాలోని  కారేపల్లి  మండలం  చీమలపాడులో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళంనం  నిర్వహించారు. ఈ సమ్మేళనం  నిర్వహిస్తున్న  సమయంలో   బాణాసంచా  పేల్చడంతో   నిప్పు రవ్వలు  ఎగిరి  పక్కనే ఉన్న గుడిసెపై  పడ్డాయి.  దీంతో  గుడిసెకు  నిప్పు అంటుకుంది.  ఈ గుడిసెలో  ఉన్న  ఎల్‌పీజీ సిలిండరు పేలింది.

గుడిసెకు  అంటుకున్న  మంటలను  ఆర్పేందుకు  పోలీసులు , స్థానికులు  వెళ్లారు.   అయితే  అదే సమయంలో  గుడిసెలో  ఉన్న  సిలిండర్  పేలింది.  ఈ పేలుడులో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన  వారిని ఖమ్మం  ఆసుపత్రికి తరలించారు.   ఖమ్మం   ఆసుపత్రిలో  బాధితులకు  చికిత్స  అందిస్తున్నారు.

ఈ  పేలుడు ఘటన సమయంలో  పలువురు కాళ్లు, చేతులు  తెగిపడ్డాయి. ఈ  ప్రాంతమంతా   రక్తంతో  నిండిపోయింది.  ఖమ్మం  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నవారి  పరిస్థితి  కూడా విషమంగా  ఉందని  వైద్యులు  చెబుతున్నారు.  ఖమ్మం  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న వారిని  మెరుగై న చికిత్స  కోసం  హైద్రాబాద్  కు తరలిస్తామని  ఖమ్మం  ఎంపీ నామా నాగేశ్వరరావు  చెప్పారు.  ఈ ఘటనలో పోలీసులు , జర్నలిస్టులు,  బీఆర్ఎస్ కార్యకర్తలు  తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిలో  ఇద్దరు మృతి చెందారు.  ఖమ్మం  ప్రభుత్వాసుపత్రిలో  చికిత్స  పొందుతూ  ఇద్దరు మృతి చెందారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ