పుచ్చపండు తిని ఇద్దరు చిన్నారులు మృతి ! ముగ్గురి పరిస్థితి విషమం.. !! (వీడియో)

By AN Telugu  |  First Published Apr 2, 2021, 1:39 PM IST

పెద్దపల్లి జిల్లా ఈసంపేటలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కలుషిత ఆహారం తిని మృత్యువాతపడ్డారు. ముగ్గురు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు.


పెద్దపల్లి జిల్లా ఈసంపేటలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కలుషిత ఆహారం తిని మృత్యువాతపడ్డారు. ముగ్గురు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు.

"

Latest Videos

undefined

వివరాల్లోకి వెడితే.. పెద్దపల్లి జిల్లా ఈసంపేటలో ఉండే ఓ కుటుంబం మంగళవారం మధ్యాహ్నం ఊరిలో అమ్మకానికి వచ్చిన పుచ్చకాయను కొన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చిన్నారులు, అత్తామామ ఉన్నారు.వీరంతా కొనుగోలు చేయగానే సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం పుచ్చకాయను రాత్రి తిద్దామని కిటికిపై ఉంచారు. రాత్రి పుచ్చపండు తిన్న కుటుంబం అంతా వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. 

దీంతో గురువారం సాయంత్రం అందరూ కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ... శుక్రవారం ఉదయం శివానంద్(12), శరణ్(10) మృతి చెందారు. పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా మద్యాహ్నం మాత్రమే పుచ్చపండు తిన్న తాత బాగానే ఉన్నాడు.

దీంతో ఈ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. మంగళవారానికి ముందు ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని చంపేందుకు మందు పెట్టిన ఆహారం పెట్టారు. ఆ విషాహారాన్ని తిన్న ఎలుకలు.. కిటికీపైన ఉన్న పుచ్చకాయను కూడా తిన్నాయని గుర్తించారు. ఎలుకలకు అంటిన మందు పుచ్చకాయకు కూడా అంటి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇది గుర్తించని కుటుంబసభ్యులు రాత్రి పుచ్చకాయను తినడంతో.. అస్వస్థతకు గురయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం రాత్రి పుచ్చకాయను తినని చిన్నారుల తాతకు ప్రాణాపాయం తప్పింది. 

click me!