చెరువులో దూకి ఇద్దరు యువ వైద్యులు ఆత్మహత్య !

Published : Jun 21, 2021, 11:33 AM IST
చెరువులో దూకి ఇద్దరు యువ వైద్యులు ఆత్మహత్య !

సారాంశం

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో విషాదం చోటు చేసుకుంది. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో దూకి ఇద్దరు యువ వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిద్దరూ సొంత అన్నాదమ్ములు కాగా, వీరికి ఆత్మహత్యా, ప్రమాదమా? అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.   

పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు వైద్యులు ఆదివారం సాయంత్రం ఎఫ్ జడ్ బైక్ మీద శామీర్ పేట్ పెద్ద చెరువు దగ్గరికి వచ్చారు. ఆ తరువాత వీరు చెరువులోకి దూకేశారు. వీరిద్దరిలో ఒకరు ఆల్వాల్ ఎక్సెల్ ఆస్పత్రిలో హోమియోపతి జూనియర్ డాక్టర్ నందన్ కాగా, మరొకరు ఆయుర్వేదిక్ వైద్యుడని వెల్లడించారు. 

ఆల్వాల్ సూర్య నగర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసించే ఈ ఇద్దరు వైద్యులు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో వీరి మృతదేహాలను బైటికి తీసినట్లు వెల్లడించారు. చెరువు దగ్గర సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

డాక్టర్లిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడిపోయారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న సాయంత్రం ఇంటినుంచి బైక్ మీద వెళ్లి.. చెరువులో శవాలుగా తేలారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

మాస్కులు, సెల్ ఫోన్లతో సహా వారికి సంబంధించిన అన్ని వస్తువులూ చెరువు గట్టు మీద దొరకడంతో ఆత్మహత్యనా అని కూడా అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu