తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల భేటీ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ, తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి ఈటల

Siva Kodati |  
Published : Jun 21, 2021, 11:21 AM ISTUpdated : Jun 21, 2021, 02:03 PM IST
తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల భేటీ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ, తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి ఈటల

సారాంశం

కాసేపట్లో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికపై సన్నాహక సమావేశంగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు ఈ భేటీకి హాజరవుతారు.

కాసేపట్లో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికపై సన్నాహక సమావేశంగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు ఈ భేటీకి హాజరవుతారు. ఇక బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు ఈటల రాజేందర్. 

కాగా, హుజురాబాద్ బీజేపీలో అలకలు మొదలయ్యాయి. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరడంతో అక్కడి పార్టీ నేతలు అలకబూనారు. మొన్న జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మాకొట్టారు. బీజేపీలోకి ఈటల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి.. కావాలనే ముఖ్యకార్యకర్తల సమావేశానికి దూరంగా వున్నట్లు కనిపిస్తోంది.

Also Read:హుజురాబాద్: ఈటల రాకపై అసంతృప్తి.. బీజేపీ ముఖ్య సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మా

అంతేకాకుండా బీజేపీలో చేరిన ఈటలను పెద్దిరెడ్డి ఇప్పటి దాకా కలవలేదు. ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనను మెత్తబరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అటు పెద్దిరెడ్డి అనుచరులు సైతం బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాలా లేదా అన్న అయోమయంలో పడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.