తెలంగాణలో కరోనా వ్యాప్తి: ఇద్దరు ఐపిఎస్ అధికారులకు పాజిటివ్

By telugu teamFirst Published Jun 20, 2020, 2:13 PM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఇద్దరు ఐపిఎస్ అధికారులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు కింది స్థాయి ఉద్యోగులకే కరోనా వైరస్ సోకుతూ వచ్చింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నానాటికీ కోవిడ్ -19 రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో కింది స్థాయి పోలీసులనే లక్ష్యం చేసుకన్న కరోనా వైరస్ ఇప్పుడు ఉన్నతాధికారులకు కూడా సోకుతోంది. తాజాగా ఇద్దరు ఐపిఎస్ అధికారులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. 

వారిద్దరు కూడా తెలంగాణ రాజధాని హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్నవారు. దీంతో ఆయా అధికారుల వద్ద పనిచేసిన, చేస్తున్న గన్ మెన్ లను, సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. మహిళా ఐపిఎస్ అధికారి కరోనా వైరస్ బారిన పడ్డారు. 

మరోవైపు డీజీపీ కార్యాలయంలో కూడా ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. తన వద్ద పనిచేసే సహాయకుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ తేలింది. దాంతో డీజీ స్థాయి అధికారి ఒకరు హోం క్వారంటైన్ కు వెళ్లారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో 20 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిని హోమ్ ఐసోలేషన్ కు పంపించారు. 

కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్ వైజర్ చికిత్స పొందుతూ మరణించాడు. జనగాం జిల్లా బచ్చనపేటకు చెందిన బాలరాజు (55) మల్లాపూర్ లో ఉంటూ ఏజిల్ సెక్యూరిటీ సంస్థ తరఫున గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన బాలరాజు ో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. 

అక్కడ కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఆస్పత్రిలో చేరిన అతను ఐసియూలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. 

click me!