కేసీఆర్ కి చేతులెత్తి నమస్కారం చేసిన కల్నల్ సంతోష్ తండ్రి

By telugu news teamFirst Published Jun 20, 2020, 10:05 AM IST
Highlights

సంతోష్ బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలం, తన కోడలు సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించినందుకు సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతులెత్తి నమస్కరించారు.

దేశం కోసం పోరాడి కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సంతోష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సూర్యపేటలో జరిగాయి. ఆయనను చూసి ఆ ప్రాంత ప్రజలు ఉప్పొంగిపోయారు. కాగా.. సంతోష్ దేశం కోసం ప్రాణాలు వదలడం పట్ల ఆయన భార్య, తల్లిదండ్రులు కూడా గర్వంతో పొంగిపోయారు.

కాగా.. కల్నల్ సంతోష్ బాబు కి కుటుంబాన్ని సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. సంతోష్ బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలం, తన కోడలు సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించినందుకు సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతులెత్తి నమస్కరించారు.

శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ కల్నల్ కుటుంబానికి ఈ సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్‌ దేశం అండగా నిలవాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని సూచించారు. దేశమంతా వారి వెంటే ఉందనే సందేశం అందించాలని పిలుపునిచ్చారు. వీరమరణం పొందిన సైనికులకు కేంద్రం ఎలాగూ సాయం చేస్తుందని.. రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సింబల్‌ ఆఫ్‌ యూనిటీని ప్రదర్శించాలని సీఎం సూచించారు.

click me!