జగన్ ని తిడుతూ మహిళ టిక్ టాక్... పోలీస్ స్టేషన్ లో రచ్చ

Published : Jan 15, 2020, 11:12 AM IST
జగన్ ని తిడుతూ మహిళ టిక్ టాక్... పోలీస్ స్టేషన్ లో రచ్చ

సారాంశం

ఏపీ సీఎం జగన్‌పై టిక్‌టాక్‌ వేదికగా అభ్యంతర కామెంట్లు చేయడం.. పలువురు మహిళల మధ్య గొడవకు కారణమైంది. టిక్‌టాక్‌లో జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై పలువురు మహిళలు పరస్పరం గొడవకు దిగారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ ని కించ పరుస్తూ... ఓ మహిళ టిక్ టాక్ వీడియో చేసింది. కాగా... ఆ వీడియో చేసిన మహిళపై మరి కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం జగన్‌పై టిక్‌టాక్‌ వేదికగా అభ్యంతర కామెంట్లు చేయడం.. పలువురు మహిళల మధ్య గొడవకు కారణమైంది. టిక్‌టాక్‌లో జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై పలువురు మహిళలు పరస్పరం గొడవకు దిగారు. ఇది కాస్తా పెరిగి పెద్దదవడంతో పరస్పరం ఒకరిపై ఒకరు ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Also Read వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్ ఆవరణలోనే గర్భిణీ ప్రసవం.

ఎస్సార్ నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. జగన్ ని కించపరుస్తూ టిక్ టాక్ వీడియోలు చేసుకున్న మహిళను స్వరూప గా గుర్తించామని వారు చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?