వర్షంలోనే స్ట్రెచర్‌పై మహిళ డెడ్ బాడీ: పోలీసుల చొరవతో చివరికిలా...

By narsimha lode  |  First Published Jul 20, 2020, 6:50 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో సోమవారం నాడు ఓ మహిళ మృతదేహాన్ని రెండు గంటల పాటు క్యాజువాలిటీ ముందే ఉంది. వర్షంలో డెడ్ బాడీ తడుస్తున్నా కూడ ఎవరూ పట్టించుకోలేదు.  



వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో సోమవారం నాడు ఓ మహిళ మృతదేహాన్ని రెండు గంటల పాటు క్యాజువాలిటీ ముందే ఉంది. వర్షంలో డెడ్ బాడీ తడుస్తున్నా కూడ ఎవరూ పట్టించుకోలేదు.  

రెండు గంటల పాటు స్ట్రెచర్ పైనే డెడ్ బాడీ ఉంది. క్యాజువాలిటీ వద్ద స్ట్రెచర్ పైనే డెడ్ బాడీని వదిలివెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ డెడ్ బాడీ గురించి  ఎవరూ పట్టించుకోలేదు.

Latest Videos

undefined

ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు  ఆ డెడ్ బాడీని ఆసుపత్రి నుండి తీసుకెళ్లేందుకు పోలీసులు చొరవ చూపారు. పోలీసులు ఆ మహిళ కుటుంబసభ్యులతో చర్చించారు. దీంతో ఆ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. 

కరోనాతో మరణించిన తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు కూడ నిరాకరిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకొంటున్నాయి. కరోనా వైరస్ సోకిన వారి నుండి ఇతరులకు ఈ వైరస్ సులభంగా సోకే అవకాశం ఉంది. డెడ్ బాడీలో కూడ కనీసం ఆరు గంటల పాటు వైరస్ జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జనం భయపడుతున్నారు. ఏంజీఎం ఆసుపత్రి వద్ద స్ట్రెచర్ పై  మహిళ ఎలా చనిపోయిందో అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.
 

click me!