మా సహనాన్ని పరీక్షించొద్దు, ఇదే చివరి అవకాశం ఇస్తున్నా... మా ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు వైద్య ఆరోగ్య శాఖను హెచ్చరించింది.
హైదరాబాద్: మా సహనాన్ని పరీక్షించొద్దు, ఇదే చివరి అవకాశం ఇస్తున్నా... మా ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు వైద్య ఆరోగ్య శాఖనుహెచ్చరించింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీహెచ్ డైరెక్టర్, డీఎంఈలను ఈ నెల 28వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.
సోమవారం నాడు కరోనా పరిస్థితులు, టెస్టులపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. కరోనా హెల్త్ బులెటిన్ ను తాము ప్రశంసించినట్టుగా పేర్కొనడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
undefined
also read:కరోనా హెల్త్ బులెటిన్: ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు
తమ ఆదేశాలను అమలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు తేల్చి చెప్పింది. తమ సహనాన్ని పరీక్షించొద్దని హైకోర్టు తెలిపింది. కరోనా హెల్త్ బులెటిన్ లో సమగ్ర వివరాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. హెల్త్ బులెటిన్ లో సమగ్ర సమాచారం ఉండాలని మరోసారి హైకోర్టు మరోసారి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను వెల్లడించాలని కూడ హైకోర్టు సూచించింది. ఆయా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకల వివరాలను కూడ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందిగా కోరింది.
ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ నిర్వహిస్తున్నారో కూడ ప్రజలకు సమాచారం తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్లపై కూడ విస్తృతంగా ప్రచారం చేయాలని కూడ సూచించింది. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కూడ మరిన్ని ఫోన్ నెంబర్లను కూడ అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను కోరింది.
పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని హైకోర్టు కోరింది.కరోనా నియంత్రణ ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగ బద్ధమైన విధి: అని హైకోర్టు అభిప్రాయపడింది.ప్రభుత్వం, అధికారులు రాజ్యాంగ బాధ్యతలు విస్మరించరాదని ఉన్నత న్యాయస్థానం సూచించింది.