జిమ్‌లలో స్టెరాయిడ్స్ విక్రయం: హయత్ నగర్‌లో ఇద్దరు అరెస్ట్

Published : Apr 02, 2023, 11:32 AM ISTUpdated : Apr 02, 2023, 11:39 AM IST
 జిమ్‌లలో స్టెరాయిడ్స్ విక్రయం: హయత్ నగర్‌లో  ఇద్దరు అరెస్ట్

సారాంశం

నగరంలోని  హయత్ నగర్ లో  జిమ్ లో  స్టెరాయిడ్స్  విక్రయిస్తున్న  ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 


హైదరాబాద్:  నగరంలోని హయత్‌నగర్ లో  జిమ్ లో స్టెరాయిడ్స్  విక్రయిస్తున్న ఇద్దరిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.  వైద్యుల  ప్రిస్కిప్షన్  లేకుండా స్టెరాయిడ్స్   విక్రయిస్తున్నారని  పోలీసులు గుర్తించారు.  బాలాజీ ధర్మాజీ,  ప్రసాద్ గులాబ్  రావులను  పోలీసులు అరెస్ట్  చేశారు.  హయత్ నగర్ లోని   రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీరిద్దరూ  పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

నిందితుల నుండి 30 ఇంజక్షన్లతో పాటు   మొబైల్ ఫోన్లను  పోలీసులు సీజ్  చేశారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా  పోలీసులు  వీరిద్దరిపై దాడి  చేసి  స్టెరాయిడ్స్ ను  సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్ లో  రూ. 250 లకు  లభ్యమయ్యే  స్టెరాయిడ్స్ ను  వెయ్యి రూపాయాలకు పైగా విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు. 

తమ బాడీ ఫిట్ నెస్  కోసం  జిమ్ లలో  వర్కౌట్లతో పాటు  స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే  త్వరగా  ఫలితం దక్కనుందని  నిందితులు  నమ్మించారు.  స్టెరాయిడ్స్ విక్రయం ద్వారా  తక్కువ కాలంలోనే  ఎక్కువ మొత్తం  సంపాదించాలని  నిందితులు  ప్లాన్  చేశారు.  జిమ్ లకు  వచ్చే  వారిని లక్ష్యంగా  చేసుకుని  స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నారు.   ఈ విషయమై  కొంత కాలంగా  పోలీసులు  నిఘా ఏర్పాటు  చేశారు.  స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న విషయమై  కచ్చితమైన సమాచారం తెలుసుకుని  నిన్న దాడి  చేశారు.  ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ ఇద్దరు నిందితులు  పనిచేసిన ఆసుపత్రుల్లో  కూడా  పోలీసులు  విచారణ  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu