
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందినవారు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు.. భూవివాదం నేపథ్యంలో అంకుషాపూర్, రామన్నపల్లెకు చెందిన ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రామన్నపల్లెకు చెందిన ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో రాజు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.