వావిలాలలో టెన్షన్ టెన్షన్... ఇంతకూ ఆ ఇద్దరమ్మాయిలు ఏమయ్యారు?

Arun Kumar P   | Asianet News
Published : Jan 12, 2021, 09:36 AM IST
వావిలాలలో టెన్షన్ టెన్షన్... ఇంతకూ ఆ ఇద్దరమ్మాయిలు ఏమయ్యారు?

సారాంశం

వావిలాల గ్రామానికి చెందిన యువతులు కృష్ణ శ్రీ, సామ వైష్ణవి కలిసి సోమవారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇంటినుండి బయటకు వెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారిద్దరు ఏమయ్యారోనని కుటుంబసభ్యులే కాదు గ్రామస్తులంతా ఆందోళనలో వున్నారు. 

వావిలాల గ్రామానికి చెందిన యువతులు కృష్ణ శ్రీ, సామ వైష్ణవి కలిసి సోమవారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రమైనా వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులు ఆందోళనకు గురయి వెతకడం ప్రారంభించారు. అమ్మాయిలకు తెలిసినవారిని, స్నేహితులను కనుక్కున్నా ఇద్దరి ఆచూకీ లభించలేదు. 

రాత్రి వరకు కూడా అమ్మాయిల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు జమ్మికుంట పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయిలిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం