సంతలో గర్భిణీకి డెలివరీ చేసిన గాంధీ వైద్యుడు (వీడియో)

Published : Jan 12, 2021, 08:19 AM ISTUpdated : Jan 12, 2021, 09:12 AM IST
సంతలో గర్భిణీకి డెలివరీ చేసిన గాంధీ వైద్యుడు (వీడియో)

సారాంశం

కుషాయిగూడకు చెందిన ఎంగువే శ్యామల, రాజే సంతలో పాత దుస్తులు అమ్ముతుంటారు. శ్యామల నిండు గర్భిణి. సాయంత్రం అనుకోకుండా నొప్పులు ప్రారంభం అయ్యాయి.

సంతలో ఓ మహిళకు వైద్యుడు డెలివరీ చేశాడు. ఈ సంఘటన కీసర మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కీసర మండల కేంద్రంలో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది. కుషాయిగూడకు చెందిన ఎంగువే శ్యామల, రాజే సంతలో పాత దుస్తులు అమ్ముతుంటారు. శ్యామల నిండు గర్భిణి. సాయంత్రం అనుకోకుండా నొప్పులు ప్రారంభం అయ్యాయి.

 స్థానికులు 108కు ఫోన్‌ చేశారు. ఈలోగా స్థానికులు చీరలు అడ్డుపెట్టి ఆమెకు సపర్యలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కీసర మీదు గా వెళ్తున్న ఓ కారుపై డాక్టర్‌ స్టిక్కర్‌ ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆ కారు ఆపారు. కారులో ఉన్న గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ అర్జున్‌ గర్భిణి వద్దకు చేరుకుని వైద్య సహాయం అందించారు. శిశువు డెలీవరీకి సహకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌లో మెరుగైన పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్‌ అర్జున్‌ చెప్పారు.

"

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?