
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం రేగుళ్లపాడులో ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతుల మధ్య గురువారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఇద్దరు మహిళా ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి.పోడు భూముల్లో వ్యవసాయ పనులు చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకొన్నారు. దీంతో పారెస్ట్ అధికారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా పారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల్లో పారెస్ట్ అధికారులకు, భూమిపై ఆధారపడిన రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ విషయమై గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.ఏజెన్సీ ప్రాంతంలో ఈ పోడు భూముల సమస్య ఉంది.ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కూడ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీ వేదికగా కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.