ఈటల బామ్మర్ది వాట్సాప్ చాట్ వివాదం... రెండుగా చీలిన దళితులు, పోటాపోటీ నిరసనలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 29, 2021, 12:39 PM ISTUpdated : Jul 29, 2021, 12:48 PM IST
ఈటల బామ్మర్ది వాట్సాప్ చాట్ వివాదం... రెండుగా చీలిన దళితులు, పోటాపోటీ నిరసనలు (వీడియో)

సారాంశం

హుజురాాబాద్ ఉపఎన్నిక వేళ బిజెపి నాయకులు ఈటల రాజేందర్ బామ్మర్ది దళితులను కించపర్చాడంటూ ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంలో నియోజకవర్గంలోని దళితులు రెండుగా చీలిపోయి నిరసనకు దిగారు. 

కరీంనగర్: ఉపఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్ లో పొలిటికర్ హీట్ కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలోని దళితుల ఓట్లను గంపగుత్తుగా పొందాలని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దళిత బంధును ఇక్కడినుండే ప్రారంభిస్తున్నారు. అంతేకాదు దళిత ఓట్లను పొందే ఏఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. 

తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను కించపరిచే విధంగా ఛాటింగ్ చేశారంటూ ఓ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అనుకూల దళితులు నిరసనకు దిగగా, ఇది తప్పుడు ప్రచారమంటూ ఈటల అనుకూల దళిత వర్గాలు కూడా నిరసన చేపట్టారు. దీంతో హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.  

read more  హుజురాబాద్ ఉప ఎన్నిక: కేసీఆర్ అహంకారానికి నాకు మధ్యే పోరు.. ఈటల వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల సతీమణి జమున సోదరుడు మధుసూధన్ రెడ్డి దళితులను కించపరిచే విధంగా ఛాటింగ్ చేశాడంటూ దళిత సంఘాల నిరసనకు దిగాయి. అయితే ఈటలను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మరో దళిత సంఘం నిరసనకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఅర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటు హుజూరాబాద్ లో ఈటల జమున భారీ ర్యాలీ చేపట్టారు.  స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగి రాస్తారోకో చేపట్టారు. 

వీడియో

''చాలా చిన్నవాటికే ఆశపడతారు ఆశపడతారు నా కొడుకులు...వారిని నమ్మలేం'' అంటూ ఈటల జమునారెడ్డి  సోదరుడు కొండవీటి మధుసూదన్ రెడ్డి అన్నట్లుగా ఓ వాట్సాఫ్ చాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ ఛాటింగ్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వుంది.  ఇక దళిత బంధు పథకం ఎన్నికల్లో ఇబ్బంది కావొచ్చంటూనే ఈటల బామ్మర్ది దళితులను కులం పేరుతో దూషించడంపై దుమారం రేగుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?