స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలు నిలిపి చందాలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటన మంగళవారం మధ్యాహ్నం వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లి కుంట క్రాస్రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ : ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళ ముఠా హైవేలపై తిష్టవేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీ షర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతేసంగతులు.
స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలు నిలిపి చందాలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటన మంగళవారం మధ్యాహ్నం వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లి కుంట క్రాస్రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
undefined
వీరంతా రాజస్థాన్ కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, ముఠాగా ఏర్పడి వచ్చి వెళ్ళే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు, సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు.
ఏడుగురు జీన్స్ పాయింట్, టీ షర్ట్ ధరించి ఉన్నారని, సడన్ గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకొని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది.