కొండగట్టు ఆంజన్న ఆలయంలో కరోనా కలకలం... ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 11:38 AM IST
Highlights

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఈ ఆలయం పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

జగిత్యాల: తెలంగాణలోని ప్రముఖ దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వాయ సన్నిధిలో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పనిచేసే ఇద్దరు దేవాదాయ శాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు, అర్చకులతో పాటు భక్తుల్లోనూ ఆందోళన మొదలయ్యింది. 

ఇప్పటికే కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన ఇద్దరు ఉద్యోగులు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమై ఆలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండగట్టు ఆలయాన్ని శానిటైజ్ చేపట్టారు. 

ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే శనివారం నుండి ఆదివారం వరకు(24గంటల్లో) 53,789 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 249 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అదే సమయంలో 24గంటల్లో 313 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6,61,551కి చేరింది. 6,52,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,258 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,895కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 5, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 11, ఖమ్మం 12, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 6, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 17, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 18, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 6 , పెద్దపల్లి 4, సిరిసిల్ల 3, రంగారెడ్డి 13, సిద్దిపేట 5, సంగారెడ్డి 6, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 3, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 14, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

  

click me!