మియాపూర్ లో అదృశ్యమైన 13 నెలల చిన్నారి... విగతజీవిగా సంప్ లో... !

Published : Sep 13, 2021, 10:48 AM IST
మియాపూర్ లో అదృశ్యమైన 13 నెలల చిన్నారి... విగతజీవిగా సంప్ లో... !

సారాంశం

చిన్నారి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  పనులకు వెళ్లి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు  ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో అదృశ్యమైన బాలిక (13నెలలు) ఘటన విషాదాంతమైంది. ఇంటి సమీపంలోని నీటి గుంతలో బాలిక మృతదేహాన్ని బాలిక గుర్తించారు. నిన్న ఉదయం పనులకు వెళ్తూ బాలిక తల్లిదండ్రులు చిన్నారిని పక్కింట్లో వదిలి వెళ్లారు. బాలికను చూసుకోమని వారికి చెప్పారు,  

చిన్నారి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  పనులకు వెళ్లి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు  ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. గుర్తుతెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం తీసుకెళ్లినట్లు వారు పోలీసులకు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు  కూడా అదృశ్యం అయినట్లు సమాచారం. 
 
PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు