హైదరాబాద్‌: మద్యం మత్తులో మహిళల రాష్ డ్రైవింగ్... స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు , వీడియో వైరల్

By Siva Kodati  |  First Published Jul 7, 2023, 7:28 PM IST

హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో TS 09 EJ 5688 నెంబర్ గల తెలుపు  రంగు బీఎండబ్ల్యూ కారు ఓ వాహనదారుడిని ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు మహిళలు వున్నారని, వారు మద్యం సేవించారని స్థానికులు చెబుతున్నారు. 


హైదరాబాద్ రోడ్లపై పాదచారులకు, వాహనదారులకు రక్షణ లేకుండా పోతోంది. తాము జాగ్రత్తగా వెళ్తున్నా ఏ వైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందోనని జనం భయపడిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం బండ్లగూడ వద్ద మార్నింగ్ వాక్‌ చేస్తున్న వారి పైకి కారు దూసుకెళ్లడంతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన మరిచిపోకముందే బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన మహిళలు రాష్ డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చారు. 

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అర్ధరాత్రి TS 09 EJ 5688 నెంబర్ గల తెలుపు  రంగు బీఎండబ్ల్యూ కారు ఖాళీగా వున్న రోడ్డుపైకి వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా తన మానాన తాను స్కూటీపై వస్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. కారులో ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు వున్నారని.. వారు మద్యం సేవించి కారు నడిపారని స్థానికులు చెబుతున్నారు.

Latest Videos

ALso Read: బండ్లగూడ రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్.. బర్త్ డే వేడుకలకు వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్‌, దర్యాప్తులో కీలక విషయాలు

అయితే జనం గుమిగూడటంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని జీహెచ్ఎంసీ సర్కిల్ మేనేజర్ జీ బాలచందర్‌గా గుర్తించారు. 

 

click me!