తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తూ ఇద్దరు స్మగ్లర్లు అరెస్టయ్యారు. ఫిలింనగర్ లో ఒకరు, వనస్థలిపురంలో మరొకరు డ్రగ్స్ విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
హైదరాబాద్ :తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్న ఇద్దరు స్మగ్లర్లు అరెస్టయ్యారు. ఫిలింనగర్ లో ఇర్పాన్ అనే ప్రైవేట్ ఉద్యోగి, వనస్థలిపురంలో సుమేష్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు.
హైదరాబాద్ టోలీచౌకికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ప్రైవేట్ ఉద్యోగి. అయితే ప్రతినెలా వచ్చే చాలిచాలని జీతంతో లగ్జరీగా బ్రతకలేక ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించాడు.ఇందుకోసం డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు.ముంబై నుండి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేవాడు.
undefined
ఇర్ఫాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి సమాచారం అందడంతో పోలీసులు ట్రాప్ చేసారు. డ్రగ్స్ కావాలని వినియోగదారుడిలా ఇర్పాన్ కు పోలీసుల ఫోన్ చేసారు. దీంతో డ్రగ్స్ తో ఫిలింనగర్ వచ్చిన అతడు నేరుగా పోలీసుల చేతిలోని డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టాడు. సివిల్ డ్రెస్ లో వున్న పోలీసులు ఇర్ఫాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇర్పాన్ వద్ద తనిఖీ చేయగా 8.56 గ్రాములు హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read More మహిళా టెకీకి న్యూడ్ వీడియో కాల్... అపార్ట్ మెంట్ వాచ్ మెన్ వేధింపులు
ఇర్పాన్ ను విచారించగా ముంబైకి చెందిన గయాన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించాడు.ఇర్ఫాన్, గయాజ్ లపై నార్కో టిక్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గయాజ్ పరారీలో ఉండగా అరెస్ట్ చేసిన ఇర్ఫాన్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కేరళ చెందిన సుమేష్ బెంగళూరు నుంచి ఎండిఎంఎ డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నాడు. గతకొంతకాలంగా హైదరాబాద్ శివారులో అతడు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ అతడిని ఎస్వోటి, ఎల్బి నగర్ పోలీసులు పట్టుకున్నారు.