అక్ర‌మ సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య..

By Mahesh Rajamoni  |  First Published Jun 23, 2023, 2:40 PM IST

Anantagiri: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తీవ్ర ఘాతుకానికి ఒడిక‌ట్టింది. త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త ప్రాణాలు తీసింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న వికారాబాద్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 


Anantagiri: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తీవ్ర ఘాతుకానికి ఒడిక‌ట్టింది. త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త ప్రాణాలు తీసింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న వికారాబాద్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో త‌న ప్రియుడితో క‌లిసి ఒక మహిళ భర్త ప్రాణాలు తీసిన షాకింగ్ ఘ‌ట‌న వికారాబాద్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ హ‌త్య వెనుక వివాహేత‌ర సంబంధం కార‌ణంగా ఉంద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో గుర్తించిన‌ట్టు తెలిపారు. వికారాబాద్ సీఐ శ్రీను ఈ హ‌త్య‌కు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. అత్వెల్లికి చెందిన నక్క రాములు(38) భార్య స్వప్నలు నివాస‌ముంటున్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తితో స్వ‌ప్న అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఆమె త‌న ప్రియుడు ఎం.పవన్‌కళ్యాణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గుర్తించిన భ‌ర్త రాములు ఆమెను చాలా హెచ్చ‌రించారు. 

Latest Videos

అయితే, ప్రియుడి మోజులో ఉన్న ఆ మ‌హిళ‌.. భ‌ర్త మాట‌ల‌ను లెక్క చేయ‌లేదు. అలాగే, త‌న త‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌నీ, ఈ అడ్డును తొల‌గించుకోవాల‌ని త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త హ‌త్య‌కు కుట్ర చేసింది. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం స‌ద‌రు మ‌హిళ‌, ప్రియుడితో క‌లిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాములు గొంతు నులిమి ప్రాణాలు తీశారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా శ‌వం ప‌క్క‌నే ప‌డుకున్నారు. ఇక ఉద‌యాన్నే త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్టుగా భ‌ర్త చ‌నిపోయాడంటూ ఏడుస్తూ శ‌వం ప‌క్క‌న కూర్చుంది. అప్ప‌టివ‌ర‌కు ఆరోగ్యంగానే ఉన్న రాములు ఇలా చ‌నిపోవ‌డ‌మేంట‌ని కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. ఇదే క్ర‌మంలో మృతుని శ‌రీరం, మెడ‌పై గాయాలు ఉండ‌టం గ‌మ‌నించారు. 

దీంతో మృతుడు రాములు కుటుంబ స‌భ్యులు, అత‌ని చెల్లి క‌లిసి పోలీసులు ఇదే విష‌యం గురించి స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు అక్క‌డి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలోనే ఆస్ప‌త్రి వ‌ద్ద ఘ‌ర్ష‌న‌లు చోటుచేసుకోవ‌డంతో సీఐ మ‌రింత మంది పోలీసు సిబ్బంది అక్క‌డి చేరుకుని గొడ‌వ‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. మృతుడు రాములు సోద‌రి య‌న్‌.యశోద ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదుచేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు త‌మ‌దైన స్టైల్ లో విచార‌ణ జ‌ర‌ప‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌నే కార‌ణంగా భార్య‌, ప్రియుడు క‌లిసి భ‌ర్త ప్రాణాలు తీసిన విష‌యం తెలిపింది. 

click me!