సరోజిని కంటి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

By narsimha lodeFirst Published Jun 18, 2020, 11:46 AM IST
Highlights

హైద్రాబాద్ సరోజిని ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది 66 మందికి కరోనా సోకింది. 26 మంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

హైదరాబాద్:హైద్రాబాద్ సరోజిని ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది 66 మందికి కరోనా సోకింది. 26 మంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

తాజాగా సరోజిని ఆసుపత్రిలో పనిచేసే పీజీ విద్యార్థులకు కరోనా సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటికి 5,675కి కరోనా కేసులు చేరుకొన్నాయి. బుధవారం నాడు ఒక్క రోజే 269 కరోనా కేసులు నమోదయ్యాయి.

also read:నిమ్స్‌లో కరోనా కలకలం: 26 మంది డాక్టర్లు, 40 మంది వైద్య సిబ్బందికి కోవిడ్

ఇటీవల కాలంలో వైద్యులకు కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.  ఈ పరిణామం ఆందోళన కల్గిస్తోంది. కరోనా సోకిన రోగులను క్వారంటైన్ కి తరలించారు అధికారులు. 

గత వారంలో కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్ కు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం పేట్లబురుజు ఆసుపత్రిలో పనిచేసే 32 మందికి కరోనా సోకింది. ఇందులో 14 మంది వైద్యులు 18 మంది వైద్య సిబ్బంది. వీరిని కూడ క్వారంటైన్ కి తరలించారు.
 

click me!