సూర్యాపేటలో ప్రారంభమైన కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

By narsimha lodeFirst Published Jun 18, 2020, 10:15 AM IST
Highlights

గాల్వామా లోయలో చైనా ఆర్మీ చేతిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర గురువారం నాడు ఉదయం సూర్యాపేటలో ప్రారంభమైంది.
 

సూర్యాపేట: గాల్వామా లోయలో చైనా ఆర్మీ చేతిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర గురువారం నాడు ఉదయం సూర్యాపేటలో ప్రారంభమైంది.

కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహం బుధవారం నాడు రాత్రి సూర్యాపేటకు చేరుకొంది. పలువురు చివరిసారిగా కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహం చూసేందుకు  తరలి వచ్చారు.

సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ పట్టణంలోని ఆయన స్వగృహం నుండి కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది.ఎంజీరోడ్డు, శంకర్ విలాస్, రైతు  బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరనస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రంలో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సూర్యాపేట పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని కేసారంలో ఉన్న సంతోష్ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

సంతోష్ బాబు మృతదేహం ర్యాలీగా వెళ్తున్న సమయంలో  స్థానికులు  అంతిమయాత్ర వాహనంపై పూలు చల్లారు. సూర్యాపేటలో వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా మూసివేశారు.

కరోనా నిబంధనలమేరకు సంతోష్ బాబు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.  మిలటరీ వాహనంలో సంతోష్ బాబు పార్థీవదేహంలో ర్యాలీగా వ్యవసాయక్షేత్రం వరకు తరలించారు.

సైనిక సిబ్బంది ఈ వాహనానికి ముందు వరుసలో సాగారు. ఆ తర్వాత సంతోష్ బాబు మృతదేహం ఉన్న వాహనం సాగింది.వ్యవసాయ క్షేత్రంలోకి సంతోష్ బాబు కుటుంబసభ్యులను మాత్రమే ఆర్మీ అధికారులు అనుమతి ఇచ్చారు. 

click me!