మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనం..

Published : Jan 25, 2023, 09:45 AM IST
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనం..

సారాంశం

మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివునూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. 

మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివునూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. వివరాలు.. గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లో ఉన్న ఇద్దరు సజీవ దహనం అయ్యారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం కాగా.. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అయితే మృతిచెందిన 60 సంవత్సరాల వృద్ధురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే