నడి రోడ్డుపై రెండు కార్లు దగ్ధం...ప్రయాణికులు సురక్షితం

Published : Oct 22, 2019, 10:51 AM IST
నడి రోడ్డుపై రెండు కార్లు దగ్ధం...ప్రయాణికులు సురక్షితం

సారాంశం

 ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.  

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై రెండు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ వార్తా పత్రిక రిపోర్టర్ నరేందర్ భార్యతో కలిసి కోదాడ నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తుండగా... హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్ దాటి వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా... ఈ ఘటనతో వారంతా భయాందోళనకుల గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం