బరువు తగ్గిస్తానంటూ నమ్మించి... యువతిని అసభ్యంగా తాకుతూ...

Published : Oct 22, 2019, 07:58 AM IST
బరువు తగ్గిస్తానంటూ నమ్మించి... యువతిని అసభ్యంగా తాకుతూ...

సారాంశం

 బరువు తగ్గిస్తామని చెబుతూ అమాయక ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మల్కాజిగిరి లో నివసిస్తున్న ఓ యువతి బరువు తగ్గించుకోవాలని TRUE WEIGHT అనే సంస్థని ఆశ్రయించింది. 

బరువు తగ్గేందుకు ఇటీవల కాలంలో చాలా మంది యువతులు కొన్ని సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారి సమక్షంలో బరువు తగ్గేందుకు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అయితే... అలాంటి వారి అవసరాన్ని అవకాశంగా చేసుకోని.. యువతుల పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. యువతులను ఎక్కడ పడితే అక్కడ తాకడం లాంటివి చేసేవాడు. ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. చివరకు బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బరువు తగ్గిస్తామని చెబుతూ అమాయక ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మల్కాజిగిరి లో నివసిస్తున్న ఓ యువతి బరువు తగ్గించుకోవాలని TRUE WEIGHT అనే సంస్థని ఆశ్రయించింది. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తరువాత సాజిద్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి ఆమేతో అసభంగా ప్రవర్తించాడు , పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానని బెదిరించాడు . 

యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి పోలీసులు సాజిద్(37) ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు . గతంలో కూడా సాజిద్ చాలా మంది యువతులతో ఈ విధంగానే ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా... నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?