వరుస దొంగతనాలతో అన్నదమ్ముల సవాల్.. కుటుంబంపై 70 దోపిడీ కేసులు

By sivanagaprasad kodatiFirst Published Oct 23, 2018, 1:52 PM IST
Highlights

వరుస దొంగతనాలకు పాల్పడుతూ రాచకొండ, సైబరాబాద్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వరుస దొంగతనాలకు పాల్పడుతూ రాచకొండ, సైబరాబాద్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పహాడీ షరీఫ్‌ వాదేముస్తఫా నగర్‌కు చెందిన మహ్మాద్ షరీఫ్ అలియాస్ బాబా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ హోటల్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో తన తమ్ముడితో కలిసి బైకులు దొంగిలిస్తూ, చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు. వీరిపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎన్నో కేసులే నమోదయ్యాయి. దొంగతనం చేసిన బైకులపై రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు..

దొంగతనం చేసే సమయంలో ఇతరులు ఎవరైనా ఎదురు తిరిగితే దాడి చేసేందుకు కత్తిని కూడా వెంట తీసుకెళ్లేవారు.. ఇటీవలే వారు చిట్యాల బస్‌ స్టాండ్‌ ప్రాంతం, పంతంగి గ్రామం, నేరెడ్‌మెట్‌ పరిధిలోని బల్‌రాంనగర్‌, చాణక్యపురి ప్రాంతాల్లో, కొత్తూరు, పామాకుల గ్రామం, మీర్‌పేట పరిధి ఎస్‌వీవీ కాలనీ, ప్రగతినగర్‌, చైతన్యపురి పరిధిలోని మారుతీనగర్‌లలో రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది.

ఈ క్రమంలో తన మైనర్ సోదరుడితో కలిసి చౌటుప్పల్‌లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోతుండగా విధులు ఉన్న సైదులు అనే హోంగార్డ్ వారిని వెంబడించి.. ఎస్‌ఐతో పాటు మిగిలిన వారిని అప్రమత్తం చేశాడు.. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్‌తో పాటు అతని వాహనం నడిపే హోంగార్డు సతీష్ వారిని పట్టుకున్నాడు.

వారి వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారం, అయిదు ద్విచక్రవాహనాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్‌బీ నగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు తెలియజేశారు. ఇక వీరి సోదరులైన సుల్తాన్, షరీఫ్, సలీం, మోయిన్‌లు దోపిడీ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి కుటుంబంపై 70 దోపిడీ కేసులు ఉన్నాయి. 

click me!