బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. నేను ఏ డబ్బు తీసుకెళ్లలేదు : మాట మార్చిన క్యాషియర్

Siva Kodati |  
Published : May 12, 2022, 03:43 PM IST
బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. నేను ఏ డబ్బు తీసుకెళ్లలేదు : మాట మార్చిన క్యాషియర్

సారాంశం

హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి రూ.22 లక్షలతో మాయమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. క్రికెట్ బెట్టింగ్ కోసం వెళ్తున్నానని మెసేజ్ పెట్టిన అతను ఇవాళ మాట మార్చాడు.   

హైదరాబాద్ వనస్థలిపురం (vanasthalipuram)  బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మిస్సింగ్ కథ (cash missing) మళ్లీ మొదటికొచ్చింది. 24 గంటలు గడవకముందే క్యాషియర్ మాట మార్చేశాడు. నిన్న డబ్బులను తానే తీసుకెళ్లానని చెప్పిన క్యాషియర్ ప్రవీణ్.. ఇవాళ మాట మార్చేశాడు. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంక్ లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై మోపుతున్నారని ఆరోపించాడు. గతంలోనూ పలుమార్లు షార్టెజ్ వచ్చిందని.. మేనేజర్‌ను నిలదీసినా పట్టించుకోలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. అయితే బ్యాంక్ మేనేజర్ వినయ్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించాడు. అనవసరంగా తనను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బ్యాంక్‌లో సరైన నిఘా కూడా లేదని క్యాషియర్ ప్రవీణ్ ఆరోపించాడు. 

కాగా..Bank Of Baroda వనస్థలిపురం బ్రాంచీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని  బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. దీంతో అతనికి బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. 

ALso Read:బెట్టింగ్‌లో డబ్బులొస్తే వస్తా, లేకపోతే సూసైడ్: రూ. 22 లక్షలు ఎత్తుకెళ్లిన వనస్థలిపురం క్యాషియర్ మేసేజ్

దీనిపై వెంటనే బ్యాంకు మేనేజర్ Policeలకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో తెలిపాడు. ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అతను మాట మార్చడం అనుమానాలకు తావిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్