వివాదంలో భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య .. మండలాధ్యక్షుడిపై బూతుల వర్షం, వీడియో వైరల్

Siva Kodati |  
Published : May 12, 2022, 03:22 PM IST
వివాదంలో భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య .. మండలాధ్యక్షుడిపై బూతుల వర్షం, వీడియో వైరల్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వివాదంలో ఇరుక్కున్నారు. తనపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశాడనే అక్కసుతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడిపై బూతుల వర్షం కురిపించారు.   

భద్రాచలం ఎమ్మెల్యే (bhadrachalam mla) పొదెం వీరయ్య (podem veeraiah) బూతులతో రెచ్చిపోయారు. మండల అధ్యక్షుడితో ఫోన్‌లో దుర్భాషలాడారు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వున్న ఇక్భాల్ పట్ల దురుసుగా మాట్లాడారు. సరిగ్గా సభ్యత్వాలు నమోదు చేయించలేదని వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీసీసీ అధ్యక్షుడి మార్పు కోసం ప్రయత్నించారని వీరయ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న అక్కసుతోనే ఇలా బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ (congress party) భద్రాచలం నుంచి ఎంఎల్ఎ గా ఉన్న పొదెం వీరయ్య ప్రస్తుం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అద్యక్షుడుగా కూడ ఉన్నాడు. అదే విదంగా టిపిసిసి ఉపాధ్యక్షుడుగా కూడ కొనసాగుతున్నాడు.

Also Read: అంతుచూస్తా... తాండూర్ సీఐపై బూతుల వర్షం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై కేసు

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన పొదెం వీరయ్య మొన్నటి 2018 ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయ్యాడు. కాగా ములుగు ఎంఎల్ఎ సీతక్క (seethakka) ఇటీవల పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఆమెకు పినపాక కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గరగా ఉంటున్నారు. ఇది కూడ పొదెం వీరయ్యకు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ బూతు పురాణం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్