ఐఐటీ విద్యార్థిని మమైతాఖాన్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రెండు సూసైడ్ లెటర్లు..

Published : Aug 09, 2023, 11:17 AM IST
ఐఐటీ విద్యార్థిని మమైతాఖాన్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రెండు సూసైడ్ లెటర్లు..

సారాంశం

హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్న మమైతాఖాన్ మృతి కేసులో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఆమె దగ్గర రెండు సూసైడ్ నోట్స్ లభించడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. 

హైదరాబాద్ : హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐఐటి విద్యార్థిని మమత ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె ఆత్మహత్యపై ఇప్పుడు పోలీసులు, కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైతా ఫోన్ ను, సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ లాబ్ కు  పంపించారు.

ఆ ల్యాబ్ రిపోర్ట్ తరువాత అనేక విషయాలు నిర్థారణ కానున్నాయి. మరోవైపు క్యాంపస్లో ర్యాగింగ్ వల్లే మమైతా చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ లు కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోటులు లభించడం గమనార్హం. దీంతో అవి ఆమె రాసిందా? ఎవరైనా రాయించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాచుపల్లి యాక్సిడెంట్ లో చిన్నారి దుర్మరణం... సీఎస్ కు హైకోర్టు నోటీసులు

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. గతనెల కార్తీక్ అనే విద్యార్థి క్యాంపస్ నుంచి వెళ్లి విశాఖ బీచ్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. సోమవారం మరో విద్యార్థిని మృతి చెందింది. హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

క్యాంపల్ హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుని మరణించింది. చదువుల ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా తేలింది. అక్కడి మార్చురీలో ఆమె మృతదేహాన్ని ఉంచారు.

మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థిని. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఒడిశానుంచి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదట కాలేజీకి వెళ్లి.. అక్కడినుంచి హాస్పిటల్ కు వెళ్లారు. నిరుడు ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ఈ క్యాంపస్ లో 4 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిరుడు ఆగస్ట్ 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇక గతనెల 15న కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెడుతున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లాడు. ఆ తరువాత నాలుగు రోజులకు విశాఖ బీచ్ లో శవంగా దొరికాడు. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఈ వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి.

 ఐఐటి హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పది రోజుల క్రితమే మమత నాయక్ ఒడిశాకు వెళ్లి వచ్చింది.  చదువులోకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.  మొదట చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.  కానీ చున్నీ తెగిపోవడంతో వైర్ తో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

సాయంత్రం 5 గంటలకు ఆమె క్యాంపస్ నుంచి హాస్టల్ కు వెళ్లింది. తరువాత రాత్రి 8 గం.ల ప్రాంతంలో భోజనం చేయడానికి కూడా రాకపోవడంతో తోటి విద్యార్థినులు రూంకు వెళ్లగా, లోపలినుంచి గడియపెట్టి ఉంది. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపులు తెరవగా మమైతా నాయక్ మృతి చెంది కనిపించింది. 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?