టీవీ9 వివాదం... హైకోర్టును ఆశ్రయించిన నటుడు శివాజీ

Published : Jun 12, 2019, 08:11 AM IST
టీవీ9 వివాదం... హైకోర్టును ఆశ్రయించిన  నటుడు శివాజీ

సారాంశం

టీవీ9 వివాదం కేసులో... సినీ నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును కోరారు. 

టీవీ9 వివాదం కేసులో... సినీ నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ శివాజీ నేడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 
ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్‌కు గత సంవత్సరం ఫిబ్రవరి 19న రూ.20లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించానని..అయితే ఎన్‌సీఎల్‌టీలో వివాదం తర్వాత షేర్లు బదిలీ చేస్తానని రవిప్రకాశ్‌ చెప్పారని శివాజీ పేర్కొన్నారు. 

రవిప్రకాశ్‌తో లావాదేవీలు కుట్ర పూరితమని వచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని శివాజీ తెలిపారు. కనీసం విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారని..తనపై ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని శివాజీ కోరారు.

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?