పరీక్ష తర్వాత ఆన్సర్ షీట్ ని వెంట తీసుకెళ్లిన విద్యార్థి... అరెస్ట్

Published : Jun 12, 2019, 07:41 AM IST
పరీక్ష తర్వాత ఆన్సర్ షీట్ ని వెంట తీసుకెళ్లిన విద్యార్థి... అరెస్ట్

సారాంశం

ఇంటర్  పరీక్షలు రాసి...  ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి ఇవ్వకుండా.... వెంట తీసుకువెళ్లిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతను ఇంటికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. 


ఇంటర్  పరీక్షలు రాసి...  ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి ఇవ్వకుండా.... వెంట తీసుకువెళ్లిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతను ఇంటికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. ఇంట్లో వాళ్లకి కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. చివరకు పోలీసులకు చిక్కాడు.  ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఈనెల 9న ఇస్లామియా కాలేజీలో ఇంటర్‌ మ్యాథ్స్‌ పరీక్ష జరుగుతుండగా ఆ పరీక్షకు హాజరైన మహ్మద్‌ హుజేఫ్‌ అహ్మద్‌(19) తన ఆన్సర్‌ షీట్‌ ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. గుర్తించిన ఇన్విజిలేటర్‌ అదేరోజు రైన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఆ యువకుడు ఇస్లామియా కాలేజీ వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్‌ చేశారు. అతని నుంచి ఆన్సర్‌ షీట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?