కేసీఆర్... ఏపీని చూసి పాలన నేర్చుకో: జీవన్‌రెడ్డి ఫైర్

Siva Kodati |  
Published : Jun 11, 2019, 08:46 PM IST
కేసీఆర్... ఏపీని చూసి పాలన నేర్చుకో: జీవన్‌రెడ్డి ఫైర్

సారాంశం

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రెండు డీఎస్సీలు పూర్తి చేసిందని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రెండు డీఎస్సీలు పూర్తి చేసిందని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు.

విద్య పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్ధుల సంఖ్య కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారంటూ విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టారు.

దేశంలో గొప్ప పథకాలు అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం పక్క రాష్ట్ర పాలన చూసైనా కేసీఆర్ కళ్లు తెరుస్తారని తాను ఆశిస్తున్నట్లు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి దారిలోనే వెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్