2017-18 లో టీవీ9 కు రూ. 200 కోట్ల ఆదాయం

By narsimha lodeFirst Published May 14, 2019, 4:49 PM IST
Highlights

 టీవీ 9 సంస్థకు 2017-18  ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్ల ఆదాయం  సంపాదించిందని కేర్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది.  టీవీ9 పేరుతో పలు భాషల్లో న్యూస్ ఛానెల్స్‌ను అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఏబీసీఎల్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 


హైదరాబాద్: టీవీ 9 సంస్థకు 2017-18  ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్ల ఆదాయం  సంపాదించిందని కేర్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది.  టీవీ9 పేరుతో పలు భాషల్లో న్యూస్ ఛానెల్స్‌ను అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఏబీసీఎల్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టీవీ 9 ఛానెల్ అత్యంత  ప్రజాధరణ ఉందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఆదరణ 2017-18  ఆర్థిక సంవత్సరానికి టీవీ 9కు కలిసివచ్చిందని కేర్ రేటింగ్స్ తేల్చి చెప్పింది.

టీవీ 9 సంస్థకు సీఈఓగా ఉన్న రవిప్రకాష్‌ను ఇటీవలనే తొలగించారు. ఫోర్జరీ ఆరోపణలతో ఆయనపై కేసులు కూడ పెట్టారు. ఈ కేసులో ఆయన పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఏబీసీఎల్‌లో 90 శాతానికి పైగా వాటాను అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేసింది. ఏబీసీఎల్ తీసుకొన్న రూ. 25 కోట్ల రుణాలకు కేర్ బీబీబీ స్టేబుల్‌ రేటింగ్‌ను ఇచ్చింది.

అలాగే రూ.15 కోట్ల స్వల్పకాలిక బ్యాంక్‌ రుణాలకు కేర్‌ ఏ3 రేటింగ్‌ను ఇస్తున్నట్లు కేర్‌ ఇటీవలి విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. పటిష్ఠమైన, అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్‌ బృందం, ప్రమోటర్లు ఆర్థికంగా బలంగా ఉండటం, అన్ని ప్రధాన భాషల్లో టీవీ9 అగ్రస్థానంలో ఉండటంతో ఏబీసీపీఎల్‌.. బ్యాంకు రుణాలకు మంచి రేటింగ్‌ను ఇచ్చినట్లు తెలిపింది. 

click me!