స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే వ్యూహం: మిత్రపక్షాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ

By Nagaraju penumalaFirst Published May 14, 2019, 4:13 PM IST
Highlights

ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి వ్యూవహంతో అయితే ఎన్నికల బరిలో నిలిచారో అలాంటి వ్యూహాన్నే రచిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలంటూ మిత్ర పక్షాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. 
 
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీ కనీసం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని చూస్తోంది. 

అయితే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలవడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. 

ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి వ్యూవహంతో అయితే ఎన్నికల బరిలో నిలిచారో అలాంటి వ్యూహాన్నే రచిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలంటూ మిత్ర పక్షాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. 

ముందస్తు ఎన్నికల్లో కలిసి పనిచేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల అధినేతలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలని లేఖలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా పార్టీల అధ్యక్షులను కోరారు. 

click me!