తెగింపు రక్తంలోనే ఉంది: దేవరాజుపై టీవీ నటి శ్రావణి సీరియస్

Published : Sep 11, 2020, 02:27 PM ISTUpdated : Sep 11, 2020, 02:28 PM IST
తెగింపు రక్తంలోనే ఉంది: దేవరాజుపై టీవీ నటి శ్రావణి సీరియస్

సారాంశం

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరింపులు చేస్తున్న దేవరాజు రెడ్డిని శ్రావణి హెచ్చిరించినట్లు తెలుస్తోంది. అయితే, అతనితో సంబంధాలు కొనసాగిస్తూనే గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది.

హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. చంపడానికైనా, చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు శ్రావణి దేవరాజురెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెగింపు తన రక్తంలోనే ఉందంటూ ఆమె దేవరాజుతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవరాజుతో ఓ వైపు సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు అతని చర్యలను ఖండిస్తూ వస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు తెలియజేస్తున్నాయి. 

దేవరాజురెడ్డిపై శ్రావణి జూన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి ఇరువురు కలుసుకున్నారు. ఆగస్టు 9వ తేదీన దేవరాజు పుట్టినరోజు సందర్బంగా అతన్ని శ్రావణి కలిసినట్లు తెలుస్తోంది. అప్పటి వీడియో కాల్ ఒక్కటి వెలుగులోకి వచ్చింది. దేవరాజు తన హీరో అంటూ ఆ వీడియోలో శ్రావణి అన్నది.

Also Read: మిస్టరీగా మారిన శ్రావణి ఆత్మహత్య కేసు: దేవరాజుతో మాట్లాడిన వీడియో లీక్

ఆ తర్వాత తిరిగి ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత శ్రావణి తమ్ముడు, బావ తనపై దాడి చేశారని దేవరాజు ఫిర్యాదు చేశాడు. శ్రావణికి సంబంధించిన వీడియోలు ఇవ్వాలని వారిద్దరు దేవరాజుపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. 

కుటుంబ సభ్యులకు, సాయికృష్ణకు తెలియకుండా శ్రావణి దేవరాజును కలుస్తూ వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఆ తర్వాతి విభేదాల నేపథ్యంలో శ్రావణి దేవరాజుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేవరాజు బెదిరింపులపై ఆమె సీరియస్ అయినట్లు చెబుతున్నారు. దేవరాజు ఖాతాలోకి శ్రావణి లక్ష రూపాయలకు పైగా బదిలీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారని అంటున్నారు.

Also Read: శ్రావణితో దేవరాజ్ భోజనం సీసీటీవీ ఫుటేజీ సీజ్: అదే రోజు ఆత్మహత్య

దేవరాజు రెడ్డిని పోలీసులు శుక్రవారంనాడు కూడా విచారిస్తున్నారు. సాయి రేపు శనివారం పోలీసుల విచారణకు వచ్చే అవకాశం ఉంది. సాయి, దేవరాజు రెడ్డిలను ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం