తెలంగాణ వచ్చాక 220 మంది జర్నలిస్టుల మృతి

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 4:43 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర మర్చిపోలేనిది. పగలనక , రాత్రనకా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా గత నాలుగేళ్లలో దాదాపు 220 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు టీయుడబ్యుజె ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర మర్చిపోలేనిది. ఇలా పగలనక , రాత్రనకా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా గత నాలుగేళ్లలో దాదాపు 220 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు టీయుడబ్యుజె ప్రతినిధులు తెలిపారు. ఈ జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలంటూ టీయుడబ్ల్యుజె, ఐజేయు ప్రతినిధి బృందం ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

అలాగే ప్రస్తుతం జర్నలిస్టులు చాలీ చాలని జీతాలతో అటు కుటుంబాలను పోషించుకోలేక, ఇటు ఇష్టమైన వృత్తిని వదులుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారని వారు పేర్కొన్నారు. వేజ్ బోర్డు సిపారసులను అమలుపర్చి జర్నలిస్టులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విన్నవించుకున్నారు.  అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్దత కల్పించాలని గవర్నర్ కు ఈ ప్రతినిధి బృందం నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు.  

గవర్నర్ ను కలిసిన వారిలో ఐజేయు నాయకులు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, మాజీద్, కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె నాయకులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, రాజేష్ లు ఉన్నారు. 

 

 

click me!