12 మంది బాలికలపై అత్యాచారం కేసు.. కామాంధుడికి, సహకరించిన వ్యక్తికి జీవితఖైదు...

By SumaBala BukkaFirst Published Jan 7, 2022, 7:05 AM IST
Highlights

అక్కడున్న 12 మంది మైనర్లపై మూడు నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. అతడికి శ్రీనివాసరావు, సరితలు సహకరించేవారు. దీంతో చిన్నారులు భయపడిపోయేవారు.  ఈ విషయం 2014 ఏప్రిల్ 3వ తేదీన బాధిత బాలిక ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు,

నల్గొండ :  నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం ఏనమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వసతిగృహంలో 12 మంది బాలికలపై Rape caseలో రమావత్ హరీశ్ నాయక్ కు Life imprisonment విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి నాగరాజు గురువారం తీర్పు వెలువరించారు.  అతనితోపాటు అతనికి సహకరించిన వసతి గృహ నిర్వాహకుడు శ్రీనివాస్ కు  జీవిత ఖైదు,  అతడి భార్య సరితకు ఆరు నెలల Imprisonment  ఖరారు చేశారు.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి... గుంటూరు జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన భార్య భర్తలు నన్నం శ్రీనివాసరావు, సరిత విలేజ్ రీ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (విఆర్ఓ) అనే ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి బాలికల వసతి గృహాన్ని నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో బాలికలను చదివించేందుకు ట్యూటర్ గా రమావత్ హరీష్ రోజూ అక్కడికి వచ్చేవాడు. వారికి చదువు చెప్పి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఆ ట్యూటర్ కు అది కాకుండా వేరే దానిమీద ఆశ కలిగింది.

అతడి కన్ను ఆ చిన్నారుల మీద పడింది. వారిని ఏం చేసినా అడిగేవారు లేరనే ధైర్యం అతడిని దారుణానికి తెగబడేలా చేసింది. దీంతో అక్కడున్న 12 మంది మైనర్లపై మూడు నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. అతడికి శ్రీనివాసరావు, సరితలు సహకరించేవారు. దీంతో చిన్నారులు భయపడిపోయేవారు.  ఈ విషయం 2014 ఏప్రిల్ 3వ తేదీన బాధిత బాలిక ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు,

మిగతా బాలికలపై అత్యాచారం జరిగినట్లు విచారణలో గుర్తించి.. 12 మంది బాలికల ఫిర్యాదు మేరకు 12 కేసులను నమోదు చేశారు. దర్యాప్తు తరువాత నిందితులపై వేర్వేరుగా 12 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ తరువాత న్యాయస్థాన విచారణలో పది కేసులలో నేర నిర్ధారణ కావడంతో హరీష్, శ్రీనివాసరావులకు జీవితఖైదు.. పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.  బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

ఇదిలా ఉండగా, గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలోని ఉట్నూరు మండలం లక్కారం పరిధిలోని కేబీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళపై యాసిడ్‌‌ పోసిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా స్థానికులు తెలిపారు. యాసిడ్ దాడి జరిగిన వెంటనే బాధిత మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. అయితే బాధిత మహిళపై యాసిడ్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!