వనమా రాఘవ అరెస్ట్ లో ట్విస్ట్.. తమకు దొరకలేదంటున్న పోలీసుల ప్రకటన

By SumaBala BukkaFirst Published Jan 7, 2022, 6:35 AM IST
Highlights

రాఘవ కోసం ఏడేనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. వనమా రాఘవపై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

హైదరాబాద్ :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదని  కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో తాజాగా గందరగోళం నెలకొంది.

రాఘవ కోసం ఏడేనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. Vanama Raghava పై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని రోహిత్ రాజ్ చెప్పారు ఆధారాలు లభిస్తే Rowdysheet నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

 నాగ రామకృష్ణ కుటుంబం Suicide వ్యవహారంలో రాఘవేంద్రరావు హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసినట్లు Social mediaలో వైరల్ అయ్యింది. ఆత్మహత్యకు ముందు Ramakrishna తీసుకున్న Selfie video చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే Vanama Venkateswara Rao స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు  లేఖరాశారు. 

తన కుమారుడుపై పాల్వంచ రామకృష్ణ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీసుల విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలా ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

 హైదరాబాద్ లో అరెస్టు చేసిన  రాఘవపై  పాల్వంచ పీఎస్లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరిగింది.  తాజాగా రాఘవను పోలీసులు అరెస్టు చేయలేదని అధికారిక ప్రకటన చేయడంతో గందరగోళం నెలకొంది. 

కాగా, ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది. 

ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తీసిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని వనమా రాఘవేందర్ తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ప్రశ్నించారు.

నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు.రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని  రామకృష్ణ అడిగారు.  వనమా రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. 

click me!