"టీచర్లు కావాలి".. విద్యార్థుల వినూత్న విజ్ఞ‌ప్తి.. సీఎంకు లేఖ‌

Published : Jan 07, 2022, 05:02 AM IST
"టీచర్లు కావాలి".. విద్యార్థుల వినూత్న విజ్ఞ‌ప్తి.. సీఎంకు లేఖ‌

సారాంశం

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న నిర‌స‌న తెలిపారు. త‌మ పాఠ‌శాల‌కు స‌రిప‌డ టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని, తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు.   

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న నిర‌స‌న తెలిపారు. త‌మ పాఠ‌శాల‌కు స‌రిప‌డ టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని, తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. ఒంటిమామిడి ప‌ల్లి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల ఒక్క‌ప్పుడూ మూసివేసే దశ వెళ్ళింది. కానీ.. అక్క‌డ ఉపాద్యాయులు, స్థానిక నేతల ప్రోత్స‌హంతో నేడు ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. తొలుత తెలుగు మీడియా ఉన్న ఈ పాఠశాల క్ర‌మంగా ఇంగ్లీష్ మీడియానికి అప్ గ్రేడ్ అవుతు వ‌స్తుంది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమ పాఠశాలగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. 

అయితే.. తాజాగా కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ ప్ర‌కారం టీచ‌ర్లు బ‌దిలీ కావ‌డంతో చివ‌రకు ఒక్క‌డే ఉపాధ్యాయుడు మిగిలారు. దీంతో విద్యార్థులంతా ఏకమై.. తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. ఒంటిమామిడి ప‌ల్లి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాలలో 2015–16 విద్యాసంవ‌త్స‌రంలో 8 మంది ఎస్జీటీ, ఒక టీపీటీ పోస్టుతో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ఆ త‌రువాత ఈ పాఠ‌శాల అప్ గ్రేడ్ అవుతూ ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు వ‌చ్చింది. ఉన్న‌త పాఠ‌శాల‌గా మారింది. అయితే..ఈ పాఠ‌శాల‌కు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మంజూరు కాకుండానే అప్‌గ్రేడ్‌ కావడంతో అస‌లు స‌మ‌స్య ప్రారంభ‌మైంది. 

విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం.. విద్యాకమిటీ సొంత డబ్బులతో కొందరు ప్రైవేట్‌ టీచర్లను ఏర్పాటుచేసుకుని  విద్యార్థుల‌కు భోద‌న చేస్తున్నారు.  మరోపక్క ఏడవ తరగతి వరకే బోధించాల్సిన ఎస్జీటీలు.. ఈ పాఠ‌శాలలో ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఇంగ్లీష్ మీడియం ఉండ‌టంతో కష్టమైనప్పటికి విద్యార్తుల‌కు బోధ‌న చేస్తున్నారు. పాఠశాల అప్‌గ్రేడ్‌ అవుతున్న విధంగా వారూ అప్‌గ్రేడ్‌ అయ్యారు.దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద తరగతులకు, ప్రాథమిక పాఠశాలకు ప్రైవేట్‌ ఉపాధ్యాయులతో బోధన కొనసాగించారు. 

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న బదిలీల్లో  స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మంజూరు అవుతాయ‌ని భావించిన మ‌ళ్లీ నిరాశ‌మే మిగిలింది. పైగా ఇటీవల చేపట్టిన బదిలీలతో పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఒకే ఉపాధ్యాయుడు మిగిలారు. దీంతో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న 8 ఎస్జీటీ పోస్టులకు అదనంగా 7 స్కూల్‌ అసిస్టెంట్, ఒక పీజీ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనకు 468 మంది విద్యార్థులు కార్డులు రాసి గురువారం పోస్టుచేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu