గొర్లు కాసుకునే వారు ఎమ్మెల్యే కాకూడదా అని వేములవాడ బీజేపీ నాయకురాలు తుల ఉమ ప్రశ్నించారు. చివరి నిమిషంలో ఆమెకు బీజేపీ బీ-ఫారం ఇవ్వకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు.
Tula Uma : వేములవాడలో తుల ఉమకు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆమెకు ఆ పార్టీ బీ-ఫారం ఇవ్వలేదు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు బీ-ఫారం అందించింది. దీంతో తుల ఉమ ఒక్క సారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంట తడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరికీ హాని చేయలేదని అన్నారు. తల్లిదండ్రులు తనను నిబద్దతతో పెంచారని, తాను అదే విధంగా పెరిగానని అన్నారు.
Hasanamba Temple Stampede : ప్రఖ్యాత హసనంబ ఆలయంలో కరెంట్ షాక్ తో తొక్కిసలాట.. 17 మందికి గాయాలు..
బీసీ బిడ్డ, మహిళ అయిన తనకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారని తెలిపారు. ప్రజలకు మేలు చేయడమే, ప్రజా నాయకురాలిగా ఎదగడమే తప్పా అని ప్రశ్నించారు. బీజేపీ ఇటీవలే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిందని, కానీ ఇక్కడ కనీసం 10 నుంచి 12 శాతం టిక్కెట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
BJP లో బీసీలకు ప్రాధాన్యత లేదు : తుల ఉమ
..
ఉద్యమకారిణి తుల ఉమ గారికి నమ్మించి గొంతు గోసిన బీజేపీ. pic.twitter.com/nVMPsILmVH
తెలంగాణలో 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తోందని తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వేములవాడ నుంచి దొరలపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. తనను నక్సలైట్ అంటున్నారని.. అవును తాను అనాడు దొరల బానిసత్వం నుంచి విముక్తి పై కోట్లాడిన మాట వాస్తవమే అన్నారు. ఇప్పుడు కూడా కోట్లాడుతానని అన్నారు. తనకు ఇంకా నమ్మకం ఉందని చెప్పారు.
ఓడలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
గొర్లు కాసుకునే వారు ఎమ్మెల్యే కావద్దా అని తుల ఉమ ప్రశ్నించారు. వేములవాడ దొరల ప్రాంతం అని, వేరే వారికి అవకాశం ఇవ్వరా అని అన్నారు. తాను కచ్చితంగా ఎమ్మెల్యే బరిలో ఉంటానని, కొట్లాడుతానని తుల ఉమ స్పష్టం చేశారు.